English | Telugu
ముక్కు అవినాష్ ఆ టైప్ అంటూ ఫైరైన షేకింగ్ శేషు!
Updated : Jun 8, 2022
జబర్దస్త్ కామెడీ షోతో ముక్కు అవినాష్ కమెడియన్ గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ లో టాప్ కమెడియన్ లలో ఒకడిగా కొనసాగుతున్న ముక్కు అవినాష్ కు బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం రావడంతో `జబర్దస్త్` షోకు గుడ్ బై చెప్పేసి మల్లెమాల నుంచి బయటికి వచ్చేశాడు. అయితే టీమ్ లీడర్ గా వున్న వ్యక్తి బయటికి వెళ్లిపోవాలంటే తమకు రూ. 10 లక్షలు కట్టాల్సిందేనంటూ మల్లెమాల టీమ్ కండీషన్ పెట్టింది. దీంతో విధిలేక ముక్కు అవినాష్ మల్లెమాల టీమ్ కు రూ. 10 లక్షలు కట్టేసి `జబర్దస్త్` షోకు గుడ్ బై చెప్పేశాడు.
దీన్నీ జీర్ణించుకోలేని ముక్కు అవినాష్ చాలా సందర్బాల్లో మల్లెమాల టీమ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా షేకింగ్ శేషు... ముక్కు అవినాష్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వ్యక్తులు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే టైపు అంటూ ముక్కు అవినాష్ పై ఫైరయ్యాడు. మల్లెమాలతో విభేధాలు వుంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఇలా పబ్లిక్ చేయడం మంచి పద్దతి కాదంటూ అవినాష్ కు చురకలంటించారు.
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేకింగ్ శేషు మాట్లాడుతూ మనం ఎక్కడ వున్నా ఏ స్థాయిలో వున్నా ఎవరి వల్ల ఎదిగాం అనే విషయాన్ని మరిచిపోకూడదని, వాళ్లలో లోపాలు ఉంటే ఆఫీస్ కి వెళ్లి చెప్పాలి తప్పితే పబ్లిక్ కాకూడదన్నారు. 'అలాంటి వాళ్లని తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకాలని అంటారు. ఎందుకంటే నువ్వు ఎదిగింది అక్కడ, పెరిగింది అక్కడ... అలాంటి సంస్థ గురించి తప్పుగా చెప్పడం తప్పు. నీకు నిజంగా అన్యాయం జరిగితే న్యాయం చేయమని అడగాలి. సోకాల్డ్ జబర్దస్త్ ఆర్టిస్ట్ లు అందరూ ఇంతింత సంపాదించి ఇల్లు కట్టుకున్నారంటే కేవలం మల్లెమాల వల్లే. అలాంటి తల్లి గురించి తప్పుగా మాట్లాడటం తప్పు` అంటూ ఫైరయ్యారు షేకింగ్ శేషు.